● మూడేళ్లుగా తగ్గుతున్న ఆదాయం ● ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లింపులతో కాస్త ఊరట | - | Sakshi
Sakshi News home page

● మూడేళ్లుగా తగ్గుతున్న ఆదాయం ● ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లింపులతో కాస్త ఊరట

Published Mon, Apr 7 2025 1:20 AM | Last Updated on Mon, Apr 7 2025 1:20 AM

● మూడ

● మూడేళ్లుగా తగ్గుతున్న ఆదాయం ● ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లింపుల

మంచిర్యాలటౌన్‌: జిల్లాలో మూడేళ్లుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతోంది. దీంతో ఆదాయం తగ్గుతోంది. 2022–23 ఆర్థిక సంవత్సరం వరకు పరిస్థితి బాగున్నప్పటికీ, ఆ తర్వాత ఆదాయం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఏటా పెరగాల్సిన ఆదాయం తగ్గడంతోపాటు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా క్షీణిస్తోంది. 2023–24లో 20,173 డాక్యుమెంట్లు రిజిస్టరై, రూ.53.02 కోట్ల ఆదాయం వచ్చింది. 2024–25లో కేవలం 13,881 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్టర్‌ అయ్యాయి. ఆదాయం రూ.53.20 కోట్లుగా నమోదైంది.

ఎల్‌ఆర్‌ఎస్‌తో ఆదాయం..

ప్రభుత్వం మార్చి నెలలో ఎల్‌ఆర్‌ఎస్‌(లేఔట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌) ఫీజులపై 25 శాతం రాయితీ ప్రకటించడంతో ఆ నెలలోనే రూ.4 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుని వారికి సబ్‌–రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నేరుగా రాయితీతో ఫీజు చెల్లించి, భూములను అమ్మే అవకాశం కల్పించడం కూడా ఈ ఆదాయానికి కారణమైంది. ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు మార్చి 31 వరకు ఉండగా, దాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించడంతో ఈ ఏప్రిల్‌లో మరిన్ని రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం కనిపిస్తోంది.

రియల్‌ వ్యాపారం ఊపందుకుంటేనే..

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మళ్లీ ఊపందుకుంటేనే ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే, ప్రభుత్వం భూముల మార్కెట్‌ విలువను పెంచడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, ఆదాయం గతంతో సమానంగా ఉంటోంది. ఈ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం ఆర్జించే కార్యాలయాల్లో రెండో స్థానంలో నిలిచిన చరిత్ర కూడా ఉంది.

ఎల్‌ఆర్‌ఎస్‌

చెల్లింపులే కీలకం

మంచిర్యాలలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం హైదరాబాద్‌తో పోటీ పడుతుందనే అభిప్రాయం ఉంది. ఇక్కడి భూముల ధరలు హైదరాబాద్‌లోని ధరలతో సమానంగా, కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ సామాన్యంగా సాగుతుండగా, ఎల్‌ఆర్‌ఎస్‌ లేని భూముల రిజిస్ట్రేషన్లు గత నెల వరకు ఆగిపోయాయి. గత నెలలో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుపై 25 శాతం రాయితీ ప్రకటించడంతో పరిస్థితి మారింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోని వారు సబ్‌–రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నేరుగా ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు.

చెల్లింపులు పెరిగే ఛాన్స్‌..

గత నెల 31 వరకు జిల్లాలో 31,093 దరఖాస్తుల్లో 7,593 మంది 25 శాతం రాయితీతో ఫీజు చెల్లించారు. ఈ నెలాఖరు వరకు రాయితీ గడువు పొడిగించడంతో మరికొంత మంది ఫీజు చెల్లించే అవకాశం ఉంది. దీంతో కొనుగోళ్లు, అమ్మకాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఏడాది మార్కెట్‌ ధరలను పెంచే అవకాశం ఉండగా, ధరలు పెరగకముందే కొనుగోళ్లు, అమ్మకాలు జరిగే సంకేతాలు

కనిపిస్తున్నాయి.

డాక్యుమెంట్లు తగ్గాయి

మంచిర్యాల సబ్‌ రి జిస్ట్రార్‌ కార్యాలయంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో 20,173 దరఖాస్తులు రిజిస్ట్రేషన్‌ అయితే, 2024–25లో 13,881 మాత్రమే రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. డాక్యుమెంట్ల వారీగా చూస్తే 31.19 శాతం దరఖాస్తుల రిజిస్ట్రేషన్లు త గ్గాయి. ఆదాయం 2024 మార్చి వరకు రూ. 53.02 కోట్లు రాగా, 2025 మార్చి వరకు రూ.53.20 కోట్లు వచ్చాయి. ఆదాయం ప రంగా చూస్తే 00.34 శాతం మాత్రమే పెరి గింది. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లింపులతో కొంత మేర ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

– ప్రియాంక, మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌

మూడేళ్లుగా రిజిస్ట్రేషన్‌ అయిన డాక్యుమెంట్లు, ఆదాయం

సంవత్సరం రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు సమకూరిన ఆదాయం

2022–23 20,038 రూ. 57.08 కోట్లు

2023–24 20,173 రూ. 53.02 కోట్లు

2024–25 13,881 రూ. 53.20 కోట్లు

● మూడేళ్లుగా తగ్గుతున్న ఆదాయం ● ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లింపుల1
1/4

● మూడేళ్లుగా తగ్గుతున్న ఆదాయం ● ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లింపుల

● మూడేళ్లుగా తగ్గుతున్న ఆదాయం ● ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లింపుల2
2/4

● మూడేళ్లుగా తగ్గుతున్న ఆదాయం ● ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లింపుల

● మూడేళ్లుగా తగ్గుతున్న ఆదాయం ● ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లింపుల3
3/4

● మూడేళ్లుగా తగ్గుతున్న ఆదాయం ● ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లింపుల

● మూడేళ్లుగా తగ్గుతున్న ఆదాయం ● ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లింపుల4
4/4

● మూడేళ్లుగా తగ్గుతున్న ఆదాయం ● ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లింపుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement