
పోలీస్ సేవల్లో సాంకేతిక విప్లవం
2024 డిసెంబర్ 16న జిల్లా కేంద్రంలోని చున్నంబట్టీ వాడకు చెందిన మైదం పురుషోత్తం మద్యం మత్తులో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేస్తున్నాడని డయల్ 100కు సమాచారం అందింది. స్పందించిన బ్లూ కోల్ట్స్ సిబ్బంది ప్రదీప్, సాయి హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పురుషో త్తంను కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
2021 అగస్టు 11న జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన వేముల లక్ష్మీనారాయణను కుటుంబ సభ్యులు మందలించడంతో మద్యం మత్తులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో వారు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. ఫోన్ సిగ్నల్‌ను ట్రాక్ చేసిన పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే లక్ష్మీనారాయణ ప ట్టాలపై పడుకుని ఉన్నారు. అప్పటి సీఐ ముత్తి లింగ య్య, గన్‌మెన్ భరత్ వెంటనే అతడిని కాపాడారు.

పోలీస్ సేవల్లో సాంకేతిక విప్లవం