
ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం..!
తహసీల్దార్ కార్యాలయం ముందు హాల్
నిరుపయోగంగా కమ్యూనిటీ హాల్
మందమర్రి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట 148 సర్వే నంబరులో సుమారు 20 గుంటలు కబ్జా చేసి కమ్యూనిటీ హాల్ నిర్మించారు. అక్రమ నిర్మాణంపై అప్పుట్లో ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితం కావడంతో అప్పటి కలెక్టర్ కర్ణన్ పర్యవేక్షణలో విచారణ జరిపి ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. నిర్మాణానికి సంబంధించిన డబ్బు కూడా చెల్లించినట్లు సమాచారం. ప్రస్తుతం హాల్ నిరుపయోగంగా ఉంది. రైతులకు గోదాము, ప్రజల సౌకర్యార్దం ఫంక్షన్ హాల్, ప్రభుత్వ కార్యాలయాల సమావేశ మందిరంగా గానీ వినియోగించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.