
కార్మికుల రక్షణకు ప్రాధాన్యత
జైపూర్: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్ గంగాధర్‌రెడ్డి అన్నారు. ఎస్టీపీపీలో బుధవారం బీఎంఎస్, హెచ్‌ఎంఎస్, ఐఎన్టీయూసీ యూనియన్ల ప్రతినిధులు, సింగరేణి, పవర్‌మేక్ అధికారుల నేతృత్వంలో రక్షణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ల ప్రతినిధులు పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. భద్రతపై అన్నిస్థాయిల కార్మికులకు శిక్షణ ఇవ్వాలని, కార్మికుల పనికి అనుగుణంగా రక్షణ పరికరాలు సరఫరా చేయాలన్నారు. కార్మికుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ప్లాంటులో ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ జీఎం శ్రీనివాసులు, వోఅండ్‌ఎం చీఫ్ జెన్‌సింగ్, ఐఎన్టీయూసీ పిట్ సెక్రెటరీ సత్యనారాయణ, బీఎంఎస్ జనరల్ సెక్రెటరీ దుస్స భాస్కర్, హెచ్‌ఎంఎస్ జనరల్ సెక్రెటరీ విక్రమ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మహిళను కాపాడిన కానిస్టేబుల్
బాసర: బాసర గోదావరినదిలో దూకేందుకు యత్నించిన మహిళను కానిస్టేబుల్ మోహన్‌సింగ్ అడ్డుకుని ప్రాణాలు రక్షించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. భైంసా పట్టణంలోని గుంటగల్లికి చెందిన మహిళ బుధవారం కుటుంబ సమస్యలతో నదిలో దూకేందుకు ప్రయత్నించడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మోహన్ సింగ్ అడ్డుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అనంతరం మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించి ఎస్సై గణేశ్ కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కార్మికుల రక్షణకు ప్రాధాన్యత