
వడదెబ్బ లక్షణాలతో గిరిజన రైతు మృతి
తాంసి: భీంపూర్ మండలం కరంజి (టి) గ్రామానికి చెందిన గిరిజన రైతు వెట్టి పురుషోత్తం (40) వ డదెబ్బ లక్షణాలతో గు రువారం రాత్రి మృతి చెందా డు. స్థానికులు తెలిపిన వి వరాల ప్రకారం.. పురుషో త్తం గురువారం మధ్యాహ్నం చేనులో పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. వడదెబ్బ లక్షణాలతో సాయంత్రం వాంతులు, విరోచనా లు చేసుకున్నాడు. గమనించిన అతడి కుటుంబీకులు సాయంత్రం స్థానికంగా చికిత్స అందించా రు. వాంతులు, విరోచనాలు తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ వాహనంలో మహారాష్ట్రలోని మాండ్వి పట్టణానికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలున్నారు.