
‘మలేరియా’లో బినామీ ల్యాబ్‌టెక్నీషియన్
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాకేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో గల మలేరియా విభాగంలో ఓ ల్యాబ్ టెక్నీషి యన్ ఏళ్లుగా విధులకు ఎగనామం పెడుతున్నాడు. ప్రైవేట్ వ్యక్తిని బినామీ ల్యాబ్ టెక్నీషియన్‌గా ఏర్పర్చుకొని ఆయన ద్వారానే పనులు కానిచ్చేస్తున్నాడు. గత 13 ఏళ్లుగా విధులకు హాజరుకావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. జైనథ్ పీహెచ్‌సీలో ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తున్న సదరు ఉద్యోగి రిమ్స్‌లో డిప్యూటేషన్‌పై ఉన్నాడు. ప్రైవేట్ ల్యాబ్‌లో పనిచేసే వ్యక్తితో వ్యవహారం కొనసాగిస్తున్నాడు. ఏళ్లుగా ఈతంతు సాగుతున్నా ఆ శాఖ అధి కారులు పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోగులతో ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుభవం లేని ప్రైవేట్ వ్యక్తులను సొంతగా నియమించుకుని మలేరియా టెస్టులు చేయిస్తున్న సమయంలో రిపోర్టులో ఎలాంటి పొరపాట్లు జరిగినా రోగులు ఇబ్బందులు పడాల్సిందే. పాజిటివ్‌కు బదులు నెగెటివ్, నెగెటివ్‌కు బదులు పాజిటివ్ వచ్చినా సమస్య ఎదురవుతుంది. అయితే గతనెలలో శ్రీసాక్షిశ్రీలో శ్రీఒకరికి బదులుశ్రీఅనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో ఆయన అప్పట్లో చేసిన బినామీ ఉద్యోగిని తప్పించి మళ్లీ కొత్త వ్యక్తిని సొంతగా నియమించుకున్నాడు. అతనికి నెలకు ఎంతోకొంత చెల్లించి తన పనులు చక్కబెట్టుకుంటున్నాడు. సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని పలువురు ల్యాబ్‌టెక్నీషియన్లు పేర్కొంటున్నారు. డీఎంహెచ్‌ఓ పరిధిలోని ఉద్యోగులు రిమ్స్ పనిచేస్తున్న వారికి ఆర్‌ఎంఓ డ్యూటీ సర్టిఫికెట్ అందజేస్తారు. ఆ అటెండెన్స్ ఆధారంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ద్వారా వేతనాలు చెల్లిస్తోంది. ఈ విషయమై డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్‌ను వివరణ కోరగా, తన దృష్టికి రాలేదని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.
ఏళ్లుగా పత్తాలేని అసలు ఉద్యోగి
వేలల్లో వేతనం తీసుకుంటూ
విధులకు ఎగనామం

‘మలేరియా’లో బినామీ ల్యాబ్‌టెక్నీషియన్