
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు..
మంచిర్యాల జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. మందమర్రిలో వృద్ధురాలి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొంది. నెన్నెల మండలం మైలారంలో వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతిచెందారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు
మందమర్రిరూరల్: పట్టణంలోని యాపల్ ఏరియాలోని జాతీయ రహదారిపై ఆదివా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంగన్‌వాడీ టీచర్ మహంకాళి భూదేవి(65) మృతిచెందింది. ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. ఇల్లందు క్లబ్ సమీపంలో నివసించే భూదేవి సరుకులు కొనేందుకు యాపల్ ఏరియాలోని జాతీయ రహదారి దాటి సరుకులు తీసుకుని తిరిగి రోడ్డు దాటేందుకు వెళ్తోంది. బెల్లంపల్లి వైపు నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొనగా భూదేవి అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కుమారుడు మోహన్‌న్‌రాజ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి ఒక కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారు.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి..
నెన్నెల: మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ధర్మరాజుల శ్రీనివాస్ (44) కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం తన ఇంట్లో టేబి రికార్డర్ రిపేర్‌కు రాగా దానిని సాల్డరింగ్ చేసి సవరించే క్రమంలో శ్రీనివాస్ విద్యుత్ షాక్‌కు గురై కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్‌ను కర్ర సాయంతో పక్కకు జరిపారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకుని అతన్ని పరీక్షించగా అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. భార్య లావణ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు..