
ట్రాక్టర్ ఢీకొని ఒకరికి గాయాలు
ఉట్నూర్‌రూరల్: మండలంలోని పులిమడుగు వద్ద ఆటో, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఇంద్రవెల్లి మండలంలోని నందునాయక్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ గోతి గణేశ్ సోమవారం ఉట్నూర్ వైపు నుంచి ఇంద్రవెల్లికి వెళ్తుండగా పులిమడుగు గ్రామం వద్ద ట్రాక్టర్ ఢీ కొట్టింది. గణేశ్‌కు తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పై రాములు తెలిపారు.