
ప్రతిభావంతులకు ప్రోత్సాహక బహుమతులు
మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ బీసీ కళాశాల వసతిగృహాల్లో ఉంటూ ఇంటర్మీడియెట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు గరుండ్ల రవీందర్, ఎన్.అభినయ శనివారం హరిత ప్లాజా టూరిజం భవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా రూ.10వేల నగదు ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బీసీ కళాశాల వసతిగృహాల ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారిని ఎంపిక చేయగా జిల్లా నుంచి ఇద్దరు ఉన్నారు. మంచిర్యాల ప్రభుత్వ బీసీ కళాశాల వసతిగృహం కంప్యూటర్ సైన్స్(వొకేషనల్) విద్యార్థి రవీందర్, బీసీ బాలికల కళాశాల వసతిగృహం ఎంపీహెచ్‌డబ్ల్యూ విద్యార్థిని అభినయ నగదు, ప్రశంసాపత్రం అందుకున్నారు. విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడంపై వసతిగృహ సంక్షేమాధికారి మోసిన్ ఆహ్మద్, సుధాలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు.