నానో ఎరువుల వినియోగం పెంచాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): పంటల సా గులో రైతులు నానో ఎరువుల వినియోగం పెంచేలా వ్యవసాయ అధికారులు కృషి చే యాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ సూచించారు. శనివారం గుడిపేట రైతువేదికలో హాజీపూర్ మండల వ్యవసాయాధికారి కృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. ద్రవ రూపంలో యూరియా, డీఏపీ వాడకం జరిగేలా అవగా హన కల్పించాలని అన్నారు. పీఎం కిసాన్, రైతుబీమా, ఎరువుల పంపిణీ ఇతర అంశాల పై అధికారులతో కలిసి ప్రగతిని సమీక్షించా రు. సమావేశంలో చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, కోరమాండల్ కంపెనీ ప్రతినిధులు, నానో ఫర్టిలైజర్ కో ఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


