యూడైస్ ప్లస్‌లో వివరాలు నమోదు చేయాలి
మంచిర్యాలఅర్బన్: ప్రీ ప్రైమరీ నుంచి ఇంట ర్మీడియెట్ విద్యనందించే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌లు యూడైస్ ప్లస్‌లో సమగ్ర వివరాలు నమోదు చేయాలని జిల్లా విద్యాధి కారి యాదయ్య అన్నారు. శనివారం జిల్లా సైన్స్ కేంద్రంలో సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డి నేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు యూడైస్ ప్లస్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ తరగతి గదులు, వాటి స్థితిగతులు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, కిచెన్‌షెడ్, ఉచిత పాఠ్య పుస్తకాలు తదితర వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎం.భరత్‌కుమార్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ రాజ్‌కుమార్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు చౌదరి, సత్యనారాయణ మూర్తి, రాజ్‌కుమార్, టెక్నికల్ పర్సన్ నగేష్ పాల్గొన్నారు.


