● జిల్లాలో ప్రాచీన కళలకు ఆదరణ ● కలరి, కర్ర, కత్తిసాము,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న రోబోటిక్ స్మార్ట్‌యుగంలో ప్రాచీన యుద్ధ కళలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ కరాటే, కుంఫూ, తైక్వాండో, యోగ తదితర విద్యల్లో జిల్లా వాసులు ప్రావీణ్యం సాధించారు. కేరళలో ఉద్భవించిన ‘కలరిపయట్టు’, మహాభారతం నాటి ‘ముద్గర్’, కర్ర, కత్తిసాము వంటి వేల ఏళ్లనాటి యుద్ధ కళల ట్రెండ్ మొదలైంది. జిల్లాలో చిన్నా పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రోజువారీగా బిజీగా ఉంటున్న వారంతా శారీరక, మానసిక దృఢత్వం కోసం రోజులో కొంత సమయం కేటాయిస్తూ కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, మంచిర్యాల
ముద్గర్
ముద్గర్ ఓ ప్రాచీన వ్యాయామ కళ. యుద్ధవిద్య(మార్షల్ ఆర్ట్స్)లో కీలక వ్యాయామమిది. దేశంలో వేల ఏళ్ల క్రితం గట్టి కర్రతో చేసే ముద్గర్‌ను వాడుతున్నారు. ముద్గర్‌ను శివుడు పరుశురాముడికి నేర్పించారని ఇతిహాసాల్లో ఉంది. భీముడు, దుర్యోధనుడు, హనుమాన్ గదలను వాడడంలో అగ్రగణ్యులు. ఈ ముద్గర్ పేరుతో ఉత్తర భారతదేశంలో అనేక క్లబ్‌లు ఉన్నాయి. ఒక కిలో బరువు ఉన్న ముద్గర్ నుంచి 30కిలోల బరువు ఉన్నవి చేతులతో తిప్పడం నేర్పుతున్నారు. చేతులు, చాతి, భుజాలు, జీర్ణక్రియలు మెరుగు పడి దృఢత్వంగా మారేందుకు దోహదపడుతోంది. జిల్లాలో గత పదేళ్ల క్రితమే ఆరంభమైనప్పటికీ ఈ మధ్యకాలంలోనే ముద్గర్‌పై వందలాదిమంది శిక్షణకు మొగ్గుచూపుతున్నారు. జిల్లా కేంద్రంలో శిక్షకుడు మండ శ్రీనివాస్ ప్రత్యేకంగా ఓ అకాడమి నిర్వహిస్తున్నారు. తమ రంగంలో మరింత పట్టు సాధించేందుకు ముద్గర్ చక్కని వ్యాయామ సాధనం.
మనస్సు, శరీరంలో అద్భుత మార్పులు
క్రీడల్లో రాణిస్తున్న వారికి శారీరక దృఢత్వం ఉంటుంది. శరీరం అదుపులో ఉంటుంది. ప్రాచీన యుద్ధ కళలతో శరీరం, మనస్సు ప్రభావితం అవుతుందని శిక్షకులు చెబుతున్నారు. అంతఃశుద్ధితో మానసిక ప్రశాంతత చేకూరి అద్భుతమైన మార్పులు వస్తాయని వివరిస్తున్నారు. క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి తగ్గి, ఆక్యుపెన్సీ పాయింట్స్ ఉత్తేజితమవుతాయి. శరీరంలో ఏడు చక్రాలు ఉత్తేజితమై సోమరితనం దూరమవుతుంది. బిజీగా ఒత్తిడితో పని చేసే ఆయా రంగాల్లో ఉండేవారికి డిప్రెషన్, చికాకు, ఆందోళన వంటివి దరి చేరవు. మానసిక ప్రశాంతతో గుండె జబ్బులు, బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర రుగ్మతల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. క్రీడల్లో రాణించే వారికి ఈ ప్రాచీన యుద్ధ కళలతో చదువులో ఏకాగ్రత పెరగడంతో రెజ్లింగ్, కుస్తీ, జూడో, క్రికెట్, కబడ్డీ తది తర క్రీడల్లో తమ నైపుణ్యాన్ని పెంపొందించుకునే వీలుంది.
● జిల్లాలో ప్రాచీన కళలకు ఆదరణ ● కలరి, కర్ర, కత్తిసాము,
● జిల్లాలో ప్రాచీన కళలకు ఆదరణ ● కలరి, కర్ర, కత్తిసాము,


