కంటి పరీక్షల సంఖ్య పెంచాలి | - | Sakshi
Sakshi News home page

కంటి పరీక్షల సంఖ్య పెంచాలి

Published Fri, Mar 17 2023 6:04 AM | Last Updated on Fri, Mar 17 2023 6:04 AM

ఎంపికై న క్రీడాకారులు 
 - Sakshi

ఎంపికై న క్రీడాకారులు

మెదక్‌జోన్‌: ‘కంటి వెలుగు’ కార్యక్రమంలో భాగంగా రోజువారీగా నిర్వహించే కంటి పరీక్షల సంఖ్యను పెంచాలని కలెక్టర్‌ రాజర్షిషా సిబ్బందికి సూచించారు. గురువారం మెదక్‌ పట్టణంలోని 29వ వార్డులో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజుకు 150 మంది శిబిరాలకు వచ్చే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్యాధికారులకు సూచించారు. అనంతరం కంటి పరీక్ష చేసుకున్న వారిని పలకరించారు. అద్దాలు నాణ్యతగా ఉన్నాయా, వైద్యులు బాగా చూస్తున్నారా అని ఆరా తీశారు. జిల్లాలో 40 బృందాల ద్వారా ఇప్పటివరకు 2,29,733 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జానకిరామ్‌సాగర్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఉత్తమ సేవలకు గుర్తింపు

మెదక్‌మున్సిపాలిటీ: జిల్లా పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ముగ్గురు మహిళా పోలీసులు రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికయ్యారని ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని తెలిపారు. గురువారం ఎస్పీ కా ర్యాలయంలో వారిని అభినందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఏ టా రాష్ట్రవ్యాప్తంగా రిసెప్షన్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేస్తారని.. 2022కు సంబంధించి జిల్లాకు చెందిన ముగ్గురు మహిళా కానిస్టేబుల్స్‌ ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. వీరు హైదరాబాద్‌లో డీజీపీ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారని తెలిపారు. అవార్డు అందుకున్న వారిలో యశోద (రేగోడ్‌ పోలీస్‌స్టేషన్‌), రేణుక (మెదక్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌) కవిత (నర్సాపూర్‌ పోలీస్‌స్టేషన్‌) ఉన్నారు.

‘సభను విజయవంతం చేయండి’

మెదక్‌జోన్‌: సంగారెడ్డిలో ఈనెల 23న నిర్వహించే సభను విజయవంతం చేయాలని ఎంఎస్పీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు యాదగిరి కోరారు. గురువారం మెదక్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ వస్తున్నారని తెలిపారు. బహుజనుల రాజ్యాధికారం కోసం ఈనెల 28న ఢిల్లీలో నిర్వహించే సభకు ముందస్తుగా సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు బాల్‌రాజు, వెంకటేశ్‌, అబ్రామ్‌, పరుశురాం, శ్రీనివాస్‌, మైసరాములు, తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు అరెస్ట్‌

రామాయంపేట(మెదక్‌): టీఎస్‌పీఎస్సీ వైఖరికి నిరసనగా ఆందోళన నిర్వహిస్తారనే సమాచారంతో పోలీసులు గురువారం ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ శశికాంత్‌ను అదుపులోకి తీసుకు న్నారు. సొంత పూచికత్తుపై సాయంత్రం విడుదల చేశారు. అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని శశికాంత్‌

పేర్కొన్నారు.

ఇంటర్‌ యూనివర్సిటీ

పోటీలకు జిల్లా క్రీడాకారులు

తూప్రాన్‌: ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు చండీగఢ్‌లోని పంజాబ్‌ యూనివర్సిటీలో జరి గే ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ మహిళల సాఫ్ట్‌బాల్‌ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారులు శిరీష, భాగ్య శ్రీ,వైష్ణవి, స్నేహ ఎంపికయ్యారని సాఫ్ట్‌బాల్‌ జిల్లా అసోసియేష న్‌ అధ్యక్షుడు నారాయణగుప్తా గురువారం తె లిపారు. ఉస్మానియా మహిళల జట్టుకు శిరీష, భాగ్యశ్రీ, తెలంగాణ మహిళా విశ్వవి ద్యా లయం నుంచి వైష్ణవి, స్నేహ ఎంపికయ్యారని వెల్లడించారు. ఈసందర్భంగా క్రీడా కారులకు అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు అజయ్‌ కుమార్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్‌ శర్మ, కోశాధికారి గోవర్ధన్‌గౌడ్‌ అభినందనలు

తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అవార్డు అందుకుంటున్న కానిస్టేబుల్‌ కవిత 1
1/2

అవార్డు అందుకుంటున్న కానిస్టేబుల్‌ కవిత

కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలిస్తున్న 
కలెక్టర్‌ రాజర్షిషా 2
2/2

కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాజర్షిషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement