చెంతనే నీరు.. ఎండుతున్న పైరు
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల
పరిశీలకుడు మహేశ్‌దత్ ఎక్కా
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది అన్నదాతలపరిస్థితి. చెరువుల్లో పుష్కలంగా నీరున్నా ఆయకట్టు భూముల్లో సాగు చేసిన పంటలకు సరిపడా నీరు అందక ఎండిపోతున్నాయి. ఫలితంగా వేలాది రూపాయలు వెచ్చించి పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
మెదక్‌జోన్: జిల్లావ్యాప్తంగా 1,400కు పైగా చెరువులు ఉండగా.. వాటి ఆయకట్టు పరిధిలో సుమారు 50 వేల వరకు పంటలు సాగవుతున్నాయి. కాగా వీటిలో 60 శాతం చెరువు ఆయకట్టు భూముల్లో రైతులు యాసంగి పంటలు సాగు చేశారు. అయితే క్షేత్రస్థాయిలో చెరువులు, కుంటలను పర్యవేక్షించే (లస్కర్లు) సిబ్బంది కరువయ్యారు. దీంతో సాగునీటి చెరువులను పట్టించుకునే వారు లేకుండా పోయారు. గతంలో గ్రామాల్లో నీరడీ, మస్కూరులు ఉండగా.. వారు గ్రామాల్లోని పనులతో పాటు చెరువుల బాధ్యతను చూసేవారు. కాల్వల వెంట తిరిగి సాగుకు అవసరమయ్యే నీటిని వదిలేవారు. అయితే గత ప్రభుత్వ వీరిని తొలగించింది.
పెద్ద చెరువుల ఆయకట్టులోనే..
జిల్లాలో 100 ఎకరాలు పైబడిన ఆయకట్టు చెరువులు పదుల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో అతిపెద్దది మెదక్ మండలం కోంటూర్ చెరువు. దీని ఆయకట్టు 8 గ్రామాల పరిధిలో 15 వందల ఎకరాలకు పైగా సాగువుతోంది. చిన్నశంకరంపేట మండలం అంబాజిపేట చెరువు రెండో పెద్దది. దీని ద్వారా ఆరు గ్రామాల పరిధిలోని 14 వందల పైచిలుకు ఎకరాలకు సాగు నీరు అందుతోందని రికార్డులు చెబుతున్నాయి. అందులో అంబాజీపేట, శంకరంపేట, గవ్వలపల్లి, మల్లుపల్లి, చందాపూర్, జంగరాయి గ్రామాల పరిధిలోని పంట పొలాలకు సాగు నీరందుతోంది. కాగా ఈ ఏడాది వానాకాలంలో వర్షాలు పుష్కలంగా కురవటంతో ఈ చెరువు నిండుకుండలా మారింది. దాని పరిధిలోని ఆరు గ్రామాల రైతులు యాసంగిలో వరి పంటలను సమృద్ధిగా సాగు చేశారు. అయితే పంట కాలువల పూడిక తీయకపోవటంతో వాటిలో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. దీనికి తోడు ఇరిగేషన్ శాఖలో క్షేత్రస్థాయి సిబ్బంది కరువయ్యారు. ఆయకట్టు పరిధిలో ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేశారు.. నీటిని ఏ మేరకు వదలాలనే నిబంధన లేకపోవటంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
గవ్వలపల్లి శివారులో సాగునీరందక ఎండిపోయిన పొలం
కాషాయమయం
నీటిని వదిలి ఆదుకోవాలి
అంబాజీపేట చెరువు ఆధారంగా ఆరెకరాల్లో వరి సా గు చేశా. పెట్టుబడికి ఇప్పటివరకు ఎకరాకు రూ. 15 వేలు ఖర్చు చేశా. సాగు నీరు వదలకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆదుకోవాలి.
– శేఖర్‌రెడ్డి, రైతు, జంగరాయి
చెంతనే నీరు.. ఎండుతున్న పైరు
చెంతనే నీరు.. ఎండుతున్న పైరు
Comments
Please login to add a commentAdd a comment