మెదక్‌లో ఇంటర్‌మూల్యాంకన కేంద్రం
పాపన్నపేట(మెదక్): మెదక్‌లో ఇంటర్ పరీక్షల మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేసినట్లు జిల్లా గెజిటెడ్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో మెదక్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రాలు సిద్దిపేట, సంగారెడ్డి పట్టణాల్లో మూల్యాంకనం చేసేవారని అన్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కలెక్టర్ రాహుల్‌రాజ్, డీఐఓ మాధవి కృషితో మెదక్‌లో కేంద్రం ఏర్పాటు చేశారని చెప్పారు.
పశువులకు వ్యాధులు సోకకుండా జాగ్రత్త పడాలి
మనోహరాబాద్(తూప్రాన్): పశువులకు వ్యా ధులు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశు వైద్యాధికారి వెంకటయ్య రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని పాలాటలో పశుగణాభివృద్ధి సంస్థ, సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా 240కు పైగా దూడలకు నట్టల నివారణ మా త్రలు, 42 పశువులకు గర్భకోశ చికిత్స చేశారు. గొర్రెలలో అమ్మతల్లి వ్యాధి రాకుండా టీకాలు వేశారు. కార్యక్రమంలో సహాయ సంచాలకులు తిరుపతి, మండల వైద్యులు లక్ష్మి, పున్నయ్య, మహేందర్‌రెడ్డి, గోపాలమిత్ర సత్యనారా యణ, సిబ్బంది కృష్ణకుమార్, రాజిరెడ్డి, అమరావతి, రామస్వామి, శేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వందశాతం ఫలితాలు సాధించాలి: డీఈఓ
శివ్వంపేట(నర్సాపూర్): పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించాలని డీఈఓ రాధాకిషన్ అన్నారు. బుధవారం మండలంలోని శివ్వంపేట, దొంతి, చెండి, కొంతాన్‌పల్లి ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. శ్రద్ధగా చదవుకోవాలని, పరీక్షలంటే భయపడవద్దని విద్యార్థులకు సూచించారు. అనుమానాలు, సమస్యలుంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. విద్యార్థులకు అల్పాహారంతో పాటు నాణ్యమైన భోజనం పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ బుచ్చానాయక్, సీఆర్‌పీ రవీందర్, ఆ యా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రం సందర్శన
మనోహరాబాద్(తూప్రాన్): ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాన్ని తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి బుధవా రం సందర్శించారు. ఈసందర్భంగా తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌కు పలు సూచనలు చేశారు.
అధిక సంఖ్యలో
కేసులు రాజీ కావాలి
మెదక్ కలెక్టరేట్: జాతీయ లోక్ అదాలత్‌లో అధికంగా కేసులు రాజీపడేలా న్యాయవాదులు, పోలీస్ అధికారులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద అన్నారు. బుధవారం జిల్లా ప్రధాన న్యాయస్థానం ఆవరణలో లోక్ అదాలత్‌కు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా న్యాయ మూర్తి మాట్లాడుతూ.. మార్చి 8న జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
కేతకీ హుండీ
ఆదాయం రూ. 28 లక్షలు
ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయం 76 రోజుల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. గర్భగుడిలోని పార్వతీపరమేశ్వరులకు అభిషేకం, మహామంగళహారతి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హైదరాబాద్‌లోని శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు ఆదాయాన్ని లెక్కించారు. ఈ మేరకు రూ.28,07,500ల ఆదాయం వచ్చి నట్లు ఆలయాధికారులు వెల్లడించారు.
మెదక్‌లో ఇంటర్‌మూల్యాంకన కేంద్రం
మెదక్‌లో ఇంటర్‌మూల్యాంకన కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment