మహిళా సంఘాలకు ఎన్నికలు!
సంగారెడ్డి జోన్: మార్చిలో మహిళా సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు. మార్చి నెలాఖరులోగా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. మహిళా స్వయం సంఘాల బలోపేతానికి సంఘాల సభ్యులతో పాటు అధ్యక్షుల పాత్ర కీలకం. జిల్లాలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మహిళా సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాలకు కొత్త అధ్యక్షులను త్వరలో ఎన్నుకోనున్నారు. ఎన్నికల నిర్వహించేందుకు ఇప్పటికే మండల స్థాయిలోని ఏపీఎంతో పాటు సీసీలకు శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మహిళా సంఘాల సభ్యులకు ఎన్నిక నిర్వహణపై అవగాహన కల్పించనున్నారు.
మూడు పద్దతులలో ఎన్నిక
మహిళా స్వయం సహాయక సంఘాల ఎన్నిక ప్రక్రియ మూడు పద్దతులలో ఎన్నుకోనున్నారు. నిబంధనల మేరకు రిజర్వేషన్ ప్రకారం ఏకగీవ్రం, చేతులు పైకి ఎత్తి, చీటీలు రాసి ప్రక్రియలో ఏదైనా ఒక ప్రక్రియలో ఎన్నుకుంటారు. ప్రతి గ్రామంలో ఉన్న సంఘాల ద్వారా ఎన్నికై న అధ్యక్షులు గ్రామ సమాఖ్య అధ్యక్షురాలును ఎన్నుకుంటారు. ఎన్నికై న గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు అందరూ కలిసి మండల సమాఖ్య అధ్యక్షురాలుని, మండల సమాఖ్య అధ్యక్షురాలు కలిసి జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిని ఎన్నుకుంటారు. మే నుంచి సంఘాలకు కొత్త అధ్యక్షులు కొనసాగనున్నారు.
అధ్యక్షుల పదవీ కాలం పొడిగింపు
గతంలో కంటే అధ్యక్షుల పదవీ కాలాన్ని పొడిగించినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామైక్య సంఘం అధ్యక్షురాలి పదవీ కాలం ఐదేళ్లకు, మండల, జిల్లా సమాఖ్యలను మూడేళ్ల పాటు నిర్ణయించారు. అదే విధంగా గతంలో కంటే ప్రస్తుతం కమిటీలో సభ్యుల సంఖ్యను తగ్గించారు. మండల, జిల్లా సమాఖ్య సంఘానికి అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారితో కమిటీని ఎన్నుకోవాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
మార్చిలో ఎన్నికల నిర్వహణపైఅధికారులకు శిక్షణ
మే నుంచి సంఘాలకు కొత్త అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment