పెద్ద బండి.. భలే ఉందండి
నార్సింగి జాతీయ రహదారిపై 160 టైర్లతో కూడిన భారీ వాహనం ఆకట్టుకుంది. గురువారం మధ్యాహ్నం రైస్‌మిల్లుల సమీపంలోని సర్వీస్‌రోడ్డుపై డ్రైవర్లు వాహనాన్ని నిలిపి కొద్దిసేపు సేదతీరారు. దీంతో జాతీయ రాహదారిపై రాకపోకలు సాగించేవారు ఆసక్తిగా గమనించారు. హైదారాబాద్ నుంచి యూపీలోని ఝాన్సీకి 280 టన్నుల తోషిబా కంపెనీ భారీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఈ వాహనంలో తరలిస్తున్నారు. ఈ కంటైనర్ గంటకు 20 కిలోమీటర్ల వేగంతో రోజుకు 40 నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణించనుంది. – చిన్నశంకరంపేట(మెదక్)
Comments
Please login to add a commentAdd a comment