మనోహరాబాద్(తూప్రాన్): రైతులు పండించిన ధా న్యం ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సురేష్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తేవాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల ఏర్పాటుకు రెండు నెలల సమయం ఉందని, ఆ లోపు రైతులు సన్నద్ధం కావాలన్నారు. గన్నీ బ్యాగులు, ఇతర సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, వ్యవసాయ అధికారి స్రవంతి, ఏఈఓలు నరేందర్‌గౌడ్, సచిన్, ఏపీఎం పెంటాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment