
విద్యుత్ బిల్లులు చెల్లించాలి
తూప్రాన్: గ్రామాల్లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లులను వెంటనే చెల్లించాలని జిల్లా విద్యుత్‌శాఖ అధికారి శంకర్ అన్నారు. శుక్రవారం తూప్రాన్‌లో పర్యటించిన ఆయన విద్యుత్ బిల్లులు, సమస్యలపై ఆరా తీశారు. పలు వీధుల్లో పర్యటించి విద్యుత్ బకాయిలు లేకుండా చూసుకోవాలని ఇంటి యజమానులకు సూచించారు. అనంతరం తూప్రాన్ డివిజన్ విద్యుత్ కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యుత్ సమస్యలు వస్తే వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వేసవి వస్తుండటంతో సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. కార్యక్రమంలో డీఈ గర్ముంతరాజు, ఏడీ శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
టీచర్ల సమస్యల
పరిష్కారానికి కృషి: ఎస్టీయూ
పెద్దశంకరంపేట(మెదక్): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ ఎల్లప్పుడు కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పర్వతరెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేటలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కూర రఘోత్తంరెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ఉపాధ్యాయులను కోరారు. ఈనెల 27న జరగబోయే ఎన్నికల్లో ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, విశ్రాంత ఉపాధ్యాయులు రామచంద్రాచారి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, కోశాధికారి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
విత్తనాల
నాణ్యతపై అవగాహన
వెల్దుర్తి(తూప్రాన్): మండల కేంద్రం మాసాయిపేట రైతు వేదికలో శుక్రవారం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతులకు వరి విత్తనాల నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పించారు. సదస్సుకు కౌడిపల్లి డివిజన్ ఏడీఏ పుణ్యవతి, తహసీల్దార్ జ్ఙానజ్యోతి హాజరై రైతులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వరి కోత సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. ధాన్యాన్ని రైతులు కల్లాల దగ్గరే తూర్పారా పట్టుకొని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా ధాన్యం ఉన్నప్పుడే కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుందని, ఇందుకు రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ రామ్‌శివరావు, ఏఈఓ రజిత, కిరణ్, రైతులు పాల్గొన్నారు. అంతకుముందు ఏడీఏ పుణ్యవ తి వెల్దుర్తి పీఏసీఎస్‌లో ఎరువుల స్టాక్‌ను పరిశీలించారు.
పౌష్టికాహారంతోనే ఆరోగ్యం
చేగుంట(తూప్రాన్): పౌష్టికాహారంతోనే మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఐకేపీ డీపీఎం మోహన్ అన్నారు. శుక్రవారం చేగుంట ఐకేపీ కార్యాలయంలో మహిళా సంఘాల సీఏలు, గ్రామైక్య సంఘం అధ్యక్షులకు మహిళల సంపూర్ణ ఆరోగ్యం అంశంపై అవగాహన కల్పించారు. రక్తహీనతకు గురికాకుండా ఉండేందుకు ఆకుకూరలు, పౌషక విలువలు గల ఆహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, ఆయా గ్రామాల సీఏలు, సీసీలు, గ్రామైక్య సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు.

విద్యుత్ బిల్లులు చెల్లించాలి

విద్యుత్ బిల్లులు చెల్లించాలి

విద్యుత్ బిల్లులు చెల్లించాలి
Comments
Please login to add a commentAdd a comment