మంటగలుస్తున్న మానవత్వం
అయిన వారే అంతమొందిస్తుండ్రు
● జిల్లాలో అమానవీయ ఘటనలు
కౌన్సెలింగ్ అవసరం
కుటుంబ కలహాలు, భూ తగాదాల్లో సముదాయించే వారు లేక అఘయిత్యాలకు పాల్పడుతున్నారు. దీంతో ఇరు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇలాంటి కేసులు పోలీస్ స్టేషన్లకు వచ్చినప్పుడు కౌన్సెలింగ్ చేయాలని మా సిబ్బందికి సూచించా. మా దృష్టికి రాగానే చాలా వరకు రాజీ చేస్తున్నాం. హత్యలు, దారుణాలు ఆగాలంటే కౌన్సెలింగ్ ఎంతో అవసరం. నేరాలను అరికట్టేందుకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపడుతాం.
– ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఎస్పీ
● అవగాహన కార్యక్రమాలు
తప్పనిసరి: ఎస్పీ
మానవ సంబంధాలు రోజురోజుకు కనుమరుగవుతున్నాయి. మనుషుల మధ్య మమతానురాగాలు మాయమైపోతున్నాయి. ఆస్తి, కుటుంబ తగాదాలతో అయిన వారినే అంతమొందిస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట అమానవీయ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. సమాజంలో రోజురోజుకు మానవత్వం మంటగలిసిపోతుండగా.. నేర ప్రవృత్తి పెరుగుతోంది. దెబ్బతింటున్న మానవ సంబంధాలను మళ్లీ బతికించేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మెదక్ మున్సిపాలిటీ:
● పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని ఇందిరాకాలనీకి చెందిన సాయిలు–భూమమ్మలకు ఇద్దరు సంతానం. చిన్న కుమారుడు ప్రదీప్ (16) మానసిక దివ్యాంగుడు. తండ్రి సాయిలు హమాలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పనిచేయనిదే పూటగడవని ఆ కుటుంబంలో ప్రదీప్‌ను సమస్యగా భావించాడు. కొడుకును సాకలేక, సపర్యలు చేయలేక గతేడాది ఆగస్టు 6న మద్యం సేవించి వచ్చిన సాయిలు, తన కొడుకుపై రోకలిబండతో దాడిచేయడంతో మృతి చెందాడు.
● పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన కర్రె ఆశయ్య (45) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఇటీవల పొలం వద్దకు వెళ్లిన సమయంలో కాలుజారి కింద పడటంతో వెన్నముక దెబ్బతింది. వైద్య ఖర్చులు భరించలేకనో.. అవిటితనంతో కుటుంబానికి భారం అవుతాడనో.. లేక రైతుబీమా వస్తుందన్న ఆశనో తెలియదు కాని కట్టుకున్న భార్య సొంత అల్లుడితో కలిసి భర్తను హత్య చేసింది.
● మద్యానికి బానిసై నిత్యం చంపుతానంటూ బెదిరిస్తున్న కొడుకును తండ్రి హతమార్చాడు. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన మాదాసు దుర్గయ్య చిన్న కుమారుడు శ్రీకాంత్ (29) మద్యానికి బానిసై నిత్యం తల్లిదండ్రులతో గొడవపడుతూ చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఈనెల 17న రాత్రి సైతం శ్రీకాంత్ మద్యం తాగివచ్చి తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. విసుగుచెందిన దుర్గయ్య తన కొడుకు నిద్రపోతున్న సమయంలో కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment