400
ప్రత్యేక బస్సులు
● 50 శాతం అదనపుచార్జీలు వసూలు! ● పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల్లోమహిళలకు ఉచితం ● రేపటి నుంచి ఏడుపాయల జాతర
మెదక్‌జోన్: ఏడుపాయల జాతరకు 400 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సన్నద్ధం అయ్యారు. హైదరాబాద్ సహా 10 డిపోల నుంచి బస్సులను నడపనున్నారు. రద్దీని బట్టి మరిన్ని నడిపేందుకు చర్యలు చేపడుతున్నారు. కాగా గతేడాది మేడారం జాతర ఉండడంతో భక్తుల రద్దీ తగ్గింది. ఈ ఏడాది భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగా ఆర్టీసీ సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రేపటి నుంచి 3 రోజుల పాటు..
ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఏడుపాయల జాతర కొనసాగనుంది. కాగా ప్రతి రోజు షెడ్యూల్ ప్రకారం తిరిగే బస్సులు యథావిధిగా తిరుగుతుండగా.. హైదరాబాద్, సికింద్రాబాద్, జేబీఎస్, బాలానగర్, నర్సాపూర్ డిపోల నుంచి 300 బస్సులు, అలాగే పటాన్‌చెరు, సంగారెడ్డి, సదాశివపేట డిపోల నుంచి 50 బస్సులు, నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోల నుంచి మరో 50 చొప్పున మొత్తం 400 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. అయితే సాధారణ చార్జీల కంటే భక్తుల నుంచి 50 శాతం అదనంగా వసూలు చేయనున్నట్లు తెలిసింది. గతేడాది జాతర సందర్భంగా ఆర్టీసీకి రూ. 10.50 లక్షల ఆదాయం రాగా, ఈ సంవత్సరం రూ. 15 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
జేబీఎస్ నుంచి 90 కిలోమీటర్లు..
రాష్ట్రంలోనే ఏడుపాయల జాతర ప్రసిద్ది చెందినది కావటంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉంది. జేబీఎస్ నుంచి వయా బాలానగర్, నర్సాపూర్ మీదుగా కొల్చారం మండలం పోతన్‌శెట్టిపల్లి నుంచి నేరుగా జాతర సమీపంలో తాత్కాలింకంగా ఏర్పాటు చేసిన బస్టాండ్ వద్ద భక్తులను దింపనున్నారు. అక్కడి నుంచి ఆర్టీసీ సంస్థ 10 మినీ బస్సుల ద్వారా భక్తులను ఆలయం వరకు తీసుకెళ్తారు. అలాగే జేబీఎస్ వయా తూప్రాన్ మీదుగా వచ్చే భక్తులను నేరుగా మెదక్ బస్ డిపోలో దింపేస్తాయి. అక్కడి నుంచి స్పెషల్ బస్సుల్లో భక్తులను మెదక్ నుంచి నేరుగా వయా మంబోజిపల్లి, నాగ్సాన్‌పల్లి నుంచి జాతర సమీపంలో బస్సులు దింపివేస్తాయి. అలాగే పటాన్‌చెరు, సంగారెడ్డి, సదాశివపేట నుంచి వచ్చే బస్సులు పోతాన్‌శెట్టిపల్లి మీదుగా నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోల నుంచి వచ్చే బస్సులు వయా బొడ్మట్‌పల్లి వయా టేక్మాల్ నుంచి పాపన్నపేట మీదుగా నాగ్సాన్‌పల్లి నుంచి జాతరకు నడువనున్నాయి.
రద్దీని బట్టి మరిన్ని బస్సులు
ఏడుపాయల జాతర నేపథ్యంలో 10 డిపోల నుంచి 400 బస్సులు నడుపుతాం. రద్దీని బట్టి మరిన్ని నడుపుతాం. అందుకోసం మరో 20 బస్సులను సిద్ధంగా ఉంచుతాం. అంతేకాకుండా సాధారణ రోజుల్లో షెడ్యూల్ ప్రకారం తిరిగే బస్సులు యథావిధిగానడిపిస్తాం. – సురేఖ, డీఎం మెదక్
400
Comments
Please login to add a commentAdd a comment