అప్పుడిచ్చారు.. ఇప్పుడు లాక్కొంటున్నారు
మెదక్ కలెక్టరేట్: భూములు లాక్కొంటున్నారు.. తమకు న్యాయం చేయాలంటూ మాసాయిపేట మండలం అచ్చంపేట దళితులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అచ్చంపేటలోని 40 బీసీ, ఎస్సీ కుటుంబాలకు గ్రామ శివారులోని 61 నుండి 135 వరకు గల సర్వే నంబర్‌లలో 1994లో అప్పటి ప్రభుత్వం జీవనోపాధికై భూములిచ్చిందన్నారు. ఎస్సీలకు మూడెకరాలు, బీసీలకు ఎకరన్నర చొప్పు న కేటాయించారని, కాని హద్దులు చూపలేదని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ భూములను సాగుకు అనువుగా మార్చుకొన్నామన్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారులు వచ్చి అడ్డుకోవడం వల్ల సాగు చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల రెవెన్యూ అధికారులు వచ్చి ఆ భూముల్లో పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారన్నారు. ఇప్పటి ప్రభుత్వం తమ భూములను లాక్కోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని వేడుకొన్నారు.
కలెక్టరేట్ ఎదుట దళితుల నిరసన
Comments
Please login to add a commentAdd a comment