నరేందర్‌రెడ్డి ఎన్నిక.. భవితకు భరోసా
పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి
వెల్దుర్తి(తూప్రాన్): ఉమ్మడి మెదక్, కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బరిలో నిలిచిన నరేందర్‌రెడ్డి ఎన్నిక.. పట్టభద్రుల భవితకు భరోసాగా నిలుస్తుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి అన్నారు. ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నరేందర్‌రెడ్డికి మద్దతుగా మండలంలోని మంగళపర్తి, వెల్దుర్తిలో ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల వ్యవధిలోనే నిరుద్యోగులకు సుమారు 57 వేలు ఉద్యోగాలు కల్పించారన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గుప్తా, రామకృష్ణారావు, సుధాకర్‌గౌడ్, మల్లేశం, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment