కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి
హవేళిఘణాపూర్(మెదక్): కాంగ్రెస్ అభ్యర్థి బలపర్చిన అభ్యర్థిని గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలు పరిష్కరిస్తామని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ అన్నారు. నిరుద్యోగుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన హామీనిచ్చారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి మద్దతుగా మండల కేంద్రం హవేళిఘణాపూర్‌లో మెదక్ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురామ్, మండల నాయకులు శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే రోహిత్
Comments
Please login to add a commentAdd a comment