
పండ్ల ధరలు ౖపైపెకి..
శివరాత్రి పండుగ సందర్భంగా పండ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండ్లు కొనుగోలు విషయంలో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూ.50కు డజన్ ఉండాల్సిన అరటి పండ్లు రూ.80, ఆపిల్ పండ్లు రూ.200 నుంచి 250కి కేజీ, ద్రాక్షపండ్లు రూ.60 నుంచి రూ.100కు, 60కి కేజీ అమ్మాల్సిన జామ 100కు విక్రయిస్తున్నారు. పూల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. పండుగ సీజన్ కాబట్టి వ్యాపారులు కూడా అమాంతం ధరలు పెంచేశారు.
– చేగుంట(తూప్రాన్):
Comments
Please login to add a commentAdd a comment