ప్రలోభాలకు ఎర
మెదక్‌జోన్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇక ప్రలోభాలకు తెరలేపారు. ఒక్కో ఓటుకు రూ.2వేల నుంచి రూ.5 వేల వరకు ఆఫర్ ఇస్తున్నారని సమాచారం. ఎక్కువ శాతం ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. అలాగే.. కొన్నిచోట్ల విందులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ‘నా వద్ద పది ఓట్లున్నాయి. ఎంత ఇస్తారు. ఫలానా పార్టీవారు ఓటకు రూ.2 వేలు అంటున్నారు. మీరు ఏమైనా ఎక్కువ ఇస్తే మీకే వేస్తాం’’అంటూ బేరసారాలకు దిగుతున్నారు. దీంతో రెండు ప్రధాన పార్టీలతో పాటు ఒకరిద్దరు స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీపడి ఓట్లను కొనుగోలుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిసింది. సాధారణ ఎన్నికలను తలదన్నే విధంగా పట్టభద్రుల ఎన్నిక జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment