నేడే మండలి పోరు
మెదక్‌జోన్: మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రా ౌగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం సాయంత్రం సిబ్బంది ఎన్నికల సామగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. కాగా పట్టభద్రుల ఎన్నికల బరిలో 56 మంది ఉండగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 71 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు 12,472, ఉండగా.. 22 పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. అలాగే ఉపాధ్యాయుల ఓటర్లు 1,347 ఉండగా, అందుకనుగుణంగా 21 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 43 మంది పోలింగ్ అధికారులు, 43 మంది ఏపీఓలు, 86 మంది ఓపీఓలు, 22 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించారు. అలాగే ప్రతి మూడు పోలింగ్ కేంద్రాలకు ఒకటి చొప్పున మొత్తం 8 రూట్లుగా విభజించారు. ఇందుకోసం ప్రత్యేకంగా 8 మంది సెక్టోరియల్ అధికారులను నియమించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిరంతర వెబ్‌కాస్టింగ్ మధ్య ఎన్నికలు జరగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్‌బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. కాగా 25 సాయంత్రం నుంచే జిల్లాలో మధ్యం, కల్లు దుకాణాలను మూసి వేయించారు. కాగా ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సిబ్బందిని ఆదేశించారు.
సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం
ఎన్నికల సామగ్రితో తరలిన సిబ్బంది
పోలింగ్ కేంద్రాల వద్ద
144 సెక్షన్ అమలు
Comments
Please login to add a commentAdd a comment