రేపు నీటి సరఫరాకు అంతరాయం
నర్సాపూర్: మిషన్ భగీరథ పథకం నల్లాల ద్వారా ఈనెల 28న తాగునీటి సరఫరా ఉండదని ఏఈ రాజ్‌కుమార్ తెలిపారు. బోర్పట్ల వద్ద పైపులైనుకు మరమ్మతులు చేయాల్సి రావడంతో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలతో పాటు సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. శనివారం నుంచి నీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని రాజ్‌కుమార్ వివరించారు.
సిద్దేశ్వరాలయంలో
అదనపు కలెక్టర్ పూజలు
హవేళిఘణాపూర్(మెదక్): మహాశివరాత్రి సందర్భంగా మండల పరిధిలోని ముత్తాయికోట సిద్దేశ్వరాలయంలో అదనపు కలెక్టర్ నగేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి గోవింద్‌మహరాజ్ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎంతో పురాతమైన సిద్దేశ్వరాలయంలో పూజలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని నగేశ్ పేర్కొన్నారు.
చర్చి ప్రెసిబెటరీ ఇన్‌చార్జి
రాబిన్‌సన్ కన్నుమూత
మెదక్‌జోన్: మెదక్ సీఎస్‌ఐ చర్చి ప్రెసిబెట రీ ఇన్‌చార్జి రాబిన్‌సన్ (73) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. 2010 నుంచి 2019 వరకు చర్చి ప్రెసిబెటరీ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం రిటైర్మెంట్ తీసుకున్నారు. అంతకు ముందు చర్చి అధ్యక్ష మండలంలో వైస్ చైర్మన్‌గా, మినిస్ట్రీయల్ కన్వీనర్‌గా పనిచేశారు. రాబిన్‌సన్‌కు భార్య దయాన రాబిన్, ఇద్దరు పిల్లలున్నారు. గురువారం మధ్యాహ్నం చర్చి ప్రాంగణంలోని శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
రేపు నీటి సరఫరాకు అంతరాయం
Comments
Please login to add a commentAdd a comment