వరిపంటకు ట్యాంకర్ నీరే దిక్కు
అడుగంటుతున్న భూగర్భ జలాలు ● రైతులకు తప్పని తిప్పలు
పంటలను కాపాడుకునేందుకు రైతుల తిప్పలు అన్నీఇన్నీకావు. ఎండలు ముదిరి భూగర్భజలాలు అడుగంటడంతో నీరు అందక పంటలు
ఎండుముఖం పడుతున్నాయి. కొమురవెల్లి మండలం గురువన్నపేటకు చెందిన వెంకటేశ్, రాజయ్య అనే రైతులు వరి సాగుచేశారు. తలాపున తపాస్‌పల్లి రిజర్వాయర్ ఉన్నా పంటలు ఎండుతున్నాయి. చేసేదిలేక బుధ వారం ట్యాంకర్‌తో నీటిని తీసుకువచ్చి పంటను తడిపారు.
ట్యాంకర్‌కు రూ.2వేల నుంచి రూ.3 వేల వరకు చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. – కొమురవెల్లి(సిద్దిపేట)
Comments
Please login to add a commentAdd a comment