కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని ఏడీఏ పుణ్యవతి అన్నారు. శుక్రవారం కౌడిపల్లిలోని ఆగ్రో స్, డీసీఎంఎస్, మన గ్రోమోర్, ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్టాక్ రికార్డులు, ధరల పట్టికను పరిశీలించారు. ఈసంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు మోతాదుకు మించి యూరియా వాడొద్దని తెలిపారు. యూరియా ఎక్కువగా వాడటం వల్ల పంటకు తెగులు, చీడపీడలు సోకుతాయని చెప్పారు. పంటలో సమస్య ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే ఎరువులు అమ్మాలని, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఓ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment