మంచి దిగుబడులతోనే మనుగడ
ప్రతి రైతు శాస్త్రవేత్తే
పంటలు పండించే ప్రతి రైతు కూడ ఒక శాస్త్రవేత్తేనని షేక్ ఎన్ మీరా అన్నారు. సొంత విత్తనాలు సాగు చేయడం అనేది రైతు హక్కు అని, దీన్ని సంరక్షించుకునేందుకు సాధక బాధకాలు చాలా ఉన్నాయన్నారు. విత్తనాలను సంస్థ పరంగా, లేదా వ్యక్తిగతంగా కాని హక్కుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా విత్తనాలపై హక్కుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన రైతులు తాము రూపొందించిన రకాల విత్తనాలను ప్రదర్శనకు పెట్టారు. సమావేశంలో ప్రిన్సిపాల్ సైటింస్ట్ ఎఆర్‌రెడ్డి, పీపీవీఎఫ్‌ఆర్ రిజిస్ట్రార్ డీకే అగర్వాల్, ఎక్స్‌పర్ట్స్ అరవింద్‌కుమార్, హరిప్రసన్న, డీడీఎస్ ఈడీ దివ్య, సభ్యుడు రామాంజనేయులు, కేవీకే ప్రతినిధులు వరప్రసాద్, రమేష్, స్నేహలత, వరలక్ష్మి పాల్గొన్నారు.
జహీరాబాద్: కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే) రైతులకు అవగాహన కల్పించాలని, అన్ని విధాలుగా సహకారం అందించాలని ఐటీఏఆర్–అటారి డైరెక్టర్ షేక్ ఎన్ మీరా సూచించారు. శుక్రవారం జహీరాబాద్‌లోని డీడీఎస్–కేవీకేలో రాష్ట్రంలోని కేవీకే శాస్త్రవేత్తలు, ముఖ్య రైతులతో సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఢిల్లీకి చెందిన ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వైరెటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ (పీపీవీఎఫ్‌ఆర్) చైర్‌పర్సన్ త్రిలోచన్ మహాపాత్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ ఎన్ మీరా మాట్లాడుతూ ప్రతి అంశంలోనూ రైతులకు సలహాలు, సూచనలిస్తూ వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించేలా సూచనలు ఇవ్వాలని కోరారు. అప్పుడే రైతులు లబ్ధి పొందగలుగుతారని పేర్కొన్నారు. ఆదాయం వస్తుందని కాకుండా రాబోయే తరానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పీపీవీఎఫ్‌ఆర్ దరఖాస్తులు చేపట్టడం అభినందనీయమని చెప్పారు. విత్తనాలపై రైతులకు హక్కులు కల్పిస్తామని, రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా రాబోయే కాలంలో బయో పైరసీని కూడా అరికట్టగలిగే స్థాయిలో ఉంటుందన్నారు.
రిజిస్ట్రేషన్‌తోనే హక్కుదారులు
నాలుగు దశాబ్ధాల నుంచి చిరుధాన్యాలు, ఇతర ధాన్యాల పరిరక్షణపై చేస్తున్న కృషికి.. రిజిస్ట్రేషన్ చేయడం ద్వారానే హక్కు వస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పాత పంటల విషయంలో జహీరాబాద్ ప్రాంతం పేరు తెచ్చుకున్నా.. చిన్న రిజిస్ట్రేషన్ చేయకపోవడం బాధాకరమైన విషయమన్నారు. మొదటగా పాత పంటలు, రైతుల రకాలు 100 నుంచి 120 రకాల వరకు ఉన్నాయన్నారు. వీటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గాను రైతులు ముందుకు రావడం సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు.
రైతులకు అవగాహన కల్పించడంలో కేవీకేలదే కీలకపాత్ర
ఐటీఏఆర్–అటారి డైరెక్టర్ షేక్ ఎన్ మీరా
Comments
Please login to add a commentAdd a comment