చికెన్ కర్రీ.. నో వర్రీ
చికెన్, ఎగ్ మేళాకు ఎగబడిన జనం
నర్సాపూర్: వెన్‌కాబ్ చికెన్ కంపెనీ, స్థానిక గోల్డెన్ చికెన్ సెంటర్ నిర్వాహకుడి ఆధ్వర్యంలో శుక్రవారం నర్సాపూర్‌లో చికెన్, ఎగ్ మేళా నిర్వహించారు. మేళాను ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ప్రజల్లో అపోహలు, భయాన్ని తొలగించేందుకే చికెన్ మేళా ఏర్పాటు చేశారని అన్నారు. బర్డ్‌ఫ్లూ మన ప్రాంతంలో లేదని, 70 డిగ్రీల వరకు చికెన్‌ను ఉడికించి తినవచ్చని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారని తెలిపారు. కోళ్ల పరిశ్రమపై చాలా మంది రైతులు ఆధారపడి ఉన్నారని, వారిని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వెన్‌కాబ్ కంపెనీ మేనేజర్లు దీరేందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాగా మేళా లో చికెన్ తో పాటు కోడిగుడ్లు పంపిణీ చేశారు.
చికెన్ కర్రీ.. నో వర్రీ
Comments
Please login to add a commentAdd a comment