కృత్రిమ మేధతో ఉత్తమ భవిత
నర్సాపూర్: కృత్రిమ మేధతో విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించారు. విద్యార్థులకు చదవడం, రాయడం సామర్థ్యాల పెంపుపై నిర్వాహకులకు ఆయన అవగాహన కల్పించారు. కృత్రిమ మేధతో విద్యార్థులు ఎలా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోగలిగితే లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టంను నిర్మించవచ్చని వివరించారు. జిల్లాలో ఆరు పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని వివరించారు. కలెక్టర్ వెంట ఎంఈఓ తారాసింగ్, పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు.
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
మెదక్‌జోన్/మెదక్ కలెక్టరేట్: ఇంటర్ పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. ఈనెల 5వ తేదీ నుంచి 23 వరకు జరగనున్న పరీక్షల ఏర్పాట్లపై శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎక్కడా తప్పులు దొర్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. తాగునీరు, మూత్రశాలల సౌకర్యం వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ ఎస్కార్ట్‌తో ప్రభుత్వ వాహనంలో పరీక్ష పేపర్లను తరలించాలన్నారు. ప్రతి సెంటర్‌కు ఇద్దరు కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించాలన్నారు. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రాథమిక చికిత్స కిట్‌లు అందుబాటులో ఉండాలని, ఆశావర్కర్లను నియమించాలని చెప్పారు. పరీక్ష రాసే విద్యార్థుల గదుల్లో ఎలాంటి మెటీరియల్ లేకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పేపర్ల తనిఖీ నిర్వహించాలని.. ఎక్కడా మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఏవీఎస్‌గా విధులు నిర్వర్తించిన కిశోర్‌బాబు శుక్రవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈసందర్భంగా ఆయనను కలెక్టర్ సత్కరించి, పూలమాలతో సన్మానించారు. ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగికి సహజమని తెలిపారు. కార్యక్రమంలో డీపీఆర్‌ఓ రామచంద్రరాజు, ఏపీఆర్‌ఓ బా బురావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment