విద్యుత్ సమస్యలు రాకుండా చర్యలు
చేగుంట(తూప్రాన్): గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు రాకుండా ఈ ఏడాది 800 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లలను ఏర్పాటు చేసినట్లు విద్యుత్‌శాఖ రూరల్ జోన్ సీఈ బాలస్వామి తెలిపారు. మండలంలోని కర్నాల్‌పల్లిలో విద్యుత్ సమస్యపై శుక్రవారం గ్రామస్తులు ధర్నా చేసిన విషయం తెలుసుకున్న ఆయన అధికారులతో కలిసి శనివారం సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. సిబ్బందితో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం బాలస్వామి మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో గతేడాది కంటే ఈసారి పదిశాతం ఎక్కువ విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. వారం రోజుల్లో మరో 82 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గొల్లపల్లిలో ఇటీవలే సబ్‌స్టేషన్ ప్రారంభించడంతో లోడ్ సైతం తగ్గిపోయిందని పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలు వస్తే స్థానిక ఏఈలకు వివరించాలని, వెంటనే పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఈ శంకర్, డీఈ గరత్మంత్‌రాజు, ఏడీఈ ఆదయ్య, ఏఈ భరత్ గ్రామస్తులు పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ రూరల్ జోన్ సీఈ బాలస్వామి
Comments
Please login to add a commentAdd a comment