
పిల్లల పార్కు స్థలాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ మున్సిపాలిటీ: అధికారులు ప్రజలతో మమేకమై విధులు నిర్వర్తించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం మెదక్ పట్టణంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈసందర్భంగా ఆయా ప్రాంతాల్లో త్వరలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి స్థల పరిశీలన చేశారు.
ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బంది ప్రజలతో మమేకమై వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రోడ్లు, డ్రైనేజీలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోడ్లపైన చెత్త కనిపించకుండా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment