
రూ.2కోట్లతో పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు
మెదక్ కలెక్టరేట్: వేసవిలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందింస్తున్నట్లు విద్యుత్ శాఖ మెదక్ రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి వెల్లడించారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో ఎస్‌ఈ శంకర్ ఆధ్వర్యంలో వేసవి ప్రణాళికపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాలో భాగంగా ఇప్పటికే రూ.2 కోట్ల వ్యయంతో పాతూరు సబ్‌స్టేషన్‌లో కొత్తగా 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను (పీటీఆర్), ర్యాలమడుగు సబ్‌స్టేషన్‌లో 3.5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే మెదక్ పట్టణంతోపాటు మండలంలోని బాలానగర్‌లో నూతనంగా విద్యుత్ సబ్‌స్టేషన్లను నిర్మించామని, మున్ముందు ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మెదక్ విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ శంకర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (డీఈలు) చాంద్‌పాషా, గరుత్మంతరాజు, శ్రీనివాసరావు, ఏడీఈలు మోహన్‌బాబు, ఆయా మండలాల ఏఈలు, సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వేసవిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా
విద్యుత్ కోతలు లేకుండా చర్యలు
విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి
Comments
Please login to add a commentAdd a comment