రైతులకు సాగునీరు అందించండి
చేర్యాల(సిద్దిపేట): తపాసుపల్లి రిజర్వాయర్‌ను గోదావరి జలాలతో నింపి చేర్యాల ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని పలువురు కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈమేరకు గురువారం భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి పలువురు కాంగ్రెస్ నాయకులు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేర్యాల ప్రాంత రైతన్నలు సాగు నీటి కోసం పడుతున్న కష్టాలను మంత్రికి వివరించామన్నారు. స్పందించిన మంత్రి రంగనాయకసాగర్ డీ10 కెనాల్‌ద్వారా కమాలాయపల్లి, అర్జునపట్ల, అకునూరు, జాలపల్లి, లింగాపూర్, దూల్మిట్టకు సాగునీరు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్–3 మోటార్లు ప్రారంభించి గండిరామారం, బొమ్మకూరు, వెల్దండ, తపాసుపల్లి రిజర్వాయర్లను నింపి రైతులకు సాగు నీరు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారన్నారు. మంత్రిని కలిసిన వారిలో మద్దూరు, చేర్యాల మాజీ జెడ్పీటీసీలు గిరి కొండల్‌రెడ్డి, కొమ్ము నర్సింగరావు, నాయకులు, ఆయా గ్రామాల రైతులు ఉన్నారు.
మంత్రి ఉత్తమ్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు
Comments
Please login to add a commentAdd a comment