మెదక్ మున్సిపాలిటీ: ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందిన సంఘటన మెదక్ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని పిట్లంబేస్‌కు చెందిన కిరణ్ (25) బైక్‌పై వెళ్తుండగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కిరణ్ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు అతడిని మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ నాగరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment