రాయికోడ్(అందోల్): ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన ప్రతీ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించి ప్రభుత్వం అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ నాగారం గొల్ల అంజయ్య లబ్ధిదారులను కోరారు. మండలంలోని నాగ్వార్ గ్రామంలో మండల ప్రత్యేకాధికారి జగదీశ్‌తో కలసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో త్వరిత గతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కో లబ్ధిదారుకు రూ.5 లక్షల బిల్లులను అందించి పేద కుటుంబాల సొంతింటి కల నెరవేర్చేందుకు కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎంఎం షరీఫ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింలు, వివిధ శాఖల సిబ్బంది నాయకులు పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయాల సంస్థ
చైర్మన్ నాగారం అంజయ్య
Comments
Please login to add a commentAdd a comment