‘పూలే’ అణగారిన వర్గాల ఆశాజ్యోతి
మెదక్ కలెక్టరేట్: అణగారిన వర్గాల అభివృద్ధి కోసం సావిత్రిబాయి పూలే కృషి చేశారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అజ్జమరి మల్లేశం అన్నారు. సోమవారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్‌లో సావిత్రిబాయి పూలే వర్ధంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమ్న జాతులు, అణగారిన వర్గాల కోసం భర్త జ్యోతిరావు పూలేతో కలిసి పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు. మహిళ విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. మహిళలకు చాలా పరిశ్రమల్లో నేటికీ సమాన పనికి– సమాన వేతనం అందడం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల్లో అయినా వారికి 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అజయ్, నా యకులు సత్యం, శ్యాంసన్, రాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment