
విపత్తులను సమర్థంగా ఎదుర్కోవాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్‌జోన్/మెదక్ కలెక్టరేట్: విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఆపద మిత్ర పథకం అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపత్తు ప్రమాద తగ్గింపు, విపత్తు నిర్వహణ వ్యవస్థ, విద్యా సామర్థ్యాన్ని బలోపేతం, సాంకేతిక పురోగతి వంటి వాటిపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలిపారు. జిల్లాలోని 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న యువతీ యువకులు 200 మంది వలంటీర్లను ఎంపిక చేయాలన్నారు. ఈనెల 20 నుంచి 31వ తేదీ వరకు పక్కా ప్రణాళికతో అమలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ప్రతి 3 నెలలకోసారి ఓటర్ల జాబితా నవీకరణ పకడ్బందీగా చేపట్టాలని, 18 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని సూచించారు. అలాగే రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా విద్యాశాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. శనివారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏఐ ద్వారా విద్యాబోధన ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఏఐ సమర్థవంతంగా అమలవుతున్నట్లు వివరించారు.