కలెక్టర్ రాహుల్‌రాజ్
వెల్దుర్తి(తూప్రాన్): ప్రభుత్వ ఆస్పత్రులకు వైద్యకోసం వచ్చే రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది మర్యాదగా ప్రవర్తిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం వెల్దుర్తి ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. మందులు అందుబాటులో ఉన్నాయా..? ఏమైనా కొరత ఉందా అని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా వార్డులు కలియతిరిగి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు. ప్రభుత్వ ఆసుపత్రికి పేద ప్రజలే ఎక్కువగా వస్తారని, వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు.
విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే
మెదక్‌జోన్:విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం పట్టణంలోని గిరిజన మినీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.
రాజకీయ ప్రతినిధులతో సమావేశం
మెదక్ కలెక్టరేట్: నూతన ఓటరు దరఖాస్తు ఫారాలను పరిశీలించి పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గత ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చులకు సంబంధించిన నివేదికలు వెంటనే అందజేయాలని సూచించారు.