
వృత్తి నైపుణ్యం.. ఉపాధికి మార్గం
ఈనెల 30 వరకు అడ్మిషన్లు
ఇప్పటివరకు 11 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చాం. ప్రస్తుతం 12వ బ్యాచ్‌కి శిక్షణ ఇచ్చేందుకు ఈనెల 30వ తేదీ వరకు అడ్మిషన్లకు అవకాశం ఉంది. మొక్కుబడి ఫీజుతో అనుభవజ్ఞులతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– మనిషా, మెదక్ శిక్షణ కేంద్రం ఇన్‌చార్జి
మెదక్ కలెక్టరేట్: ఎలాంటి ఉద్యోగం లభించక, స్వయం ఉపాధి పొందడానికి మార్గం కానరాక ఎంతో మంది నిరుద్యోగులు నలిగిపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం 7 నుంచి 10 తరగతి పూర్తి చేసిన నిరుద్యోగులకు వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలో గత మూడేళ్లుగా నిరుద్యోగ యువతీ యువకులకు వయస్సుతో నిమిత్తం లేకుండా వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు.
ఇప్పటివరకు 11 బ్యాచ్‌లు పూర్తి
నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల్లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, యువజన సర్వీసుల శాఖ, జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో ఇప్పటి 11 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చారు. ఇందులో శిక్షణ పొందిన వందలాది మంది యువతీ, యువకులు పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల్లో చేరారు. అలాగే మరికొంతమంది స్వయం ఉపాధి పొందుతున్నారు. మహిళలు బ్యూటీ పార్లర్, మగ్గం వర్క్, కంప్యూటర్ శిక్షణ, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్సుకొని ఉపొధి పొందుతున్నారు. కొంతమంది పలు కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. పెళ్లి అయిన మహిళలు తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. అలాగే యువకులు సీసీటీవీ, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఎలక్ట్రిక్, మోబైల్ సర్వీసింగ్ నేర్చుకొని స్వయం పొందుతున్నారు.
అనుభవజ్ఞులతో శిక్షణ
ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేలా అనుభవజ్ఞులతో శిక్షణ ఇస్తున్నారు. పరిమిత సంఖ్యలో ఉంటే ప్రతి ఒక్కరికిపై శ్రద్ధ చూపవచ్చునని, ప్రతి బ్యాచ్‌కు 30 మందికి మాత్రమే అడ్మిషన్‌కు అవకాశం కల్పిస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, జర్దోషి (మగ్గం వర్క్) కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. అలాగే సీ్త్ర, పురుషులకు కంప్యూటర్ (ఎంఎస్ ఆఫీస్), సీసీ టీవీ ఫిట్టింగ్, రిపేర్, కంప్యూటర్ హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్ (హౌస్ వైరింగ్), మోబైల్ సర్వీసింగ్, రిపేర్ కోర్సుల్లో 3 నెలల శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ధృవీకరణ పత్రం అందజేస్తారు. ఒక్కో కోర్సుకు రూ. 1,500 ఫీజు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. లేదా బ్యాంకుల ద్వారా రుణాలు పొంది స్వయం ఉపాధి పొందవచ్చు.
ఎనిమిది కోర్సుల్లో
నిరుద్యోగులకు శిక్షణ

వృత్తి నైపుణ్యం.. ఉపాధికి మార్గం
Comments
Please login to add a commentAdd a comment