సీనియర్ సివిల్ జడ్జి జితేందర్
మెదక్ కలెక్టరేట్: రైతుల ప్రైవేట్ అప్పులు తీర్చేందుకు బ్యాంకులు అదనపు రుణాలు అందిస్తున్నాయని సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ తెలిపారు. బుధవారం హవేళిఘణాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులు, బ్యాంకర్లు, రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు మాట్లాడుతూ.. జిల్లాలో ప్రైవేట్ అప్పుల బాధతో ఉన్న రైతులందరూ, వెంటనే బ్యాంకులలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మైసయ్య, నాయకులు యాదాగౌడ్, వెంకటేశం, చంద్రశేఖర్, లీడ్ బ్యాంకు మేనేజర్ నర్సింహా, బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.