ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
మెదక్ మున్సిపాలిటీ: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించా రు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నెలవారీ క్రైం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. నేర నియంత్రణలో భాగంగా ప్రతి పట్టణం, గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. దొంగతనాలు జరగకుండా రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహించాలని చెప్పారు. ప్రస్తుతం ఒంటి పూట బడులు కావడంతో విద్యార్థులు బావులు, వాగులు, వంకలలో ఈతకు వెళ్లి ప్రాణం మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా గమనించాలన్నారు. లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, మెదక్, తూప్రాన్ డీఎస్పీలు ప్రసన్నకుమార్, వెంకట్‌రెడ్డి ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.