పీఎం విశ్వకర్మలో మూడు పథకాలు అవుట్
● మూడేళ్లుగా ఆగిన లబ్ధిదారుల ఎంపిక ● ఆందోళనలో వృత్తిదారులు ● జిల్లాలో 1,303 దరఖాస్తులు
వృత్తిపైనే ఆధారపడి ఉన్నం
తాతల కాలం నుంచి వడ్రంగి వృత్తియే ఆధారం. దీనితోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ప్రభుత్వ సాయంతో పనిముట్లు కొనుగోలు చేసుకుందామని రెండేళ్ల క్రితం పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటికీ ఎంపిక చేయడం లేదు. ఎంతో ఆశతో దరఖాస్తు చేసుకున్నా.. ప్రయోజనం లేకుండా పోయింది.
– వడ్ల రవి, అక్కన్నపేట, రామాయంపేట
పథకాలు అందించాలి
పీఎం విశ్వకర్మలో వడ్రంగి, మేసన్, టైల ర్ వృత్తిదారులకు సంబంధించిన పథకాలు నిలిపివేయడం అన్యాయం. రెండేళ్ల క్రితం ఈ పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నా. ప్రభుత్వం వెంటనే లబ్ధిదారుల ఎంపిక చేపట్టి సంక్షేమ పథకాలు అందించాలి.
– వడ్ల శ్రీనివాస్, అక్కన్నపేట, రామాయంపేట
మెదక్ కలెక్టరేట్: అంతరించిపోతున్న సంప్రదాయ చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు 2023లో కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. చేతి వృత్తులు, సంప్రదాయ సాధనాలపై ఆధారపడిన కళాకారులకు సమగ్ర సహాయం అందించాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. పథకం ప్రారంభించిన సమయంలో 18 రకాల వృత్తిదారులను ఎంపిక చేసి దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. దీంతో 2023 నుంచి ఇప్పటివరకు జిల్లాలో వేలాది మంది వృత్తిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కొన్ని పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్ అందజేశారు. అలాగే బ్యాంకు ద్వారా రూ. 1 లక్ష రుణం ఇచ్చారు. ఈ క్రమంలో ఏడాదిగా పథకంలో మేసన్, వడ్రంగి, టైలర్ పథకాలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. జిల్లాలో 1,303 మంది లబ్ధిదారులు ఈ పథకాల కోసం దరఖాస్తు చేసుకొని ఆశగా ఎదుచూస్తున్నారు. ఈ విషయమై జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాశ్‌ను వివరణ కోరగా మేసన్, వడ్రంగి, టైలర్ పథకాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. విశ్వకర్మ పథకంలో అత్యధికంగా ఈ మూడు వృత్తిదారుల దరఖాస్తులు వస్తున్నాయని, దీంతో మిగతా లబ్ధిదారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు చెప్పారు. అందుకే వారి ఎంపిక తాత్కాలికంగా నిలిపివేశారని, తిరిగి ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభిస్తుందో తెలియదని అన్నారు.
ప్రోత్సాహం ఏదీ?
ప్రోత్సాహం ఏదీ?