
ఈ పాస్ మిషన్ల ద్వారా ఎరువులు
కౌడిపల్లి(నర్సాపూర్): డీలర్లు ఈ పాస్ మిషన్ల ద్వారా ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్‌కుమార్ అన్నారు. మంగళవారం కౌడిపల్లిలోని భాగ్యలక్ష్మి ట్రేడర్స్, మహమ్మద్‌నగర్‌లోని పీఏసీఎస్ ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసి స్టాక్, రిజిస్టర్, ధరల పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఎరువులు అమ్మాలని సూచించారు. మోతాదుకు మించి ఎరువులు చల్లవద్దని డీలర్లు రైతులకు చెప్పాలన్నారు. సీజన్‌కు అనుగుణంగా ఎరువులు అందుబా టులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ పుణ్యవతి, ఏఓ స్వప్న, డీలర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ అధికారి విన య్‌కుమార్
పశుగ్రాసం, పండ్లతోటలపై రైతులకు అవగాహన
నర్సాపూర్: రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు శాస్త్రవేత్తలు పలు అంశాలపై మంగళవారం అవగాహన కల్పించారు. స్థానిక రైతు వేదికలో జిల్లా వ్యవసాయాధికారి విన్సెంట్ వినయ్‌కుమార్ పలువురు రైతులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ను వీక్షించారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త బాలాజీనాయక్ వేసవిలో పశుగ్రాస యాజమాన్యం అంశంపై, అసిస్టెంట్ ప్రొఫెసర్ శంకర్ స్వామి పండ్ల తోటల అంశంపై, ఇప్కో రాష్ట్ర మార్కెటింగ్ మేనేజర్ కృపాశంకర్ మాట్లాడుతూ నానో ఎరువుల ప్రయోజనాలు, దిగుబడి పెంపు, నేల ఆరోగ్యం ప్రభావం అనే అంశాలపై వీడియో ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారులు దీపిక, రాజశేఖర్, ఏఈఓలు చంద్రవేణి, రవివర్మ, నిరోష, తేజస్విని, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.