
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం
చిన్నశంకరంపేట(మెదక్): ప్రభుత్వ ఆస్పత్రులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. బుధవారం నార్సింగి ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫార్మసిస్ట్ గది, ల్యాబ్, ఓపీ రికార్డులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఇదే సమయంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ అందుబాటులో లేకపోవడంపై ఆరా తీశారు. సబ్‌సెంటర్ పరిశీలనకు వెళ్లినట్లు సిబ్బంది చెప్పడంతో మూమెంట్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో గ్రామీణ మహిళలను భాగస్వామ్యం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈసందర్భంగా డాక్టర్ రవికుమార్‌కు పలు సూచనలు చేశారు.
నిరుద్యోగులకు మంచి అవకాశం
రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలోని మీ సేవ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్‌రాజ్ బుధవారం సందర్శించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి అర్హులైన యువత తెలంగాణ ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసే ప్రక్రియను పరిశీలించారు. మీసేవ నిర్వాహకుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, తద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రజని, మీ సేవ నిర్వాహకులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్