
అమరవీరులకు నివాళి
మెదక్ మున్సిపాలిటీ: ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలో ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు శివదయాల్ మాట్లాడుతూ.. సామాన్యులపై ఉగ్రవాదుల దాడులు సరికాదన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ సభ్యులు చంద్రశేఖర్, విజయ్ కుమార్, నవీన్ కుమార్, పెంటాగౌడ్, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రమౌళి, అశోక్ కుమార్, సుష్మా, సునీతా తదితరులు పాల్గొన్నారు.