
ప్రజల గుండెల్లో పదేళ్ల పాలన
మెదక్ మున్సిపాలిటీ: పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ఎన్నో సమస్యలను పరిష్కరించి ప్రజల గుండెల్లో నిలిచిందని పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి పేర్కొన్నారు. రజతోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం మెదక్ పార్టీ కార్యాలయంలో గులాబీ జెండాను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది అమరులయ్యారని వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని ఉద్యమ నేత, రథసారధి కేసీఆర్ బీఆర్‌ఎస్‌ను స్థాపించారని తెలిపారు. ఎన్నో ఏళ్ల పోరాటంతో లక్ష్యం నెరవేరిందని, రాష్ట్రం సిద్ధించాక కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి సాధ్యమైందన్నారు. అనంతరం మెదక్ నుంచి వరంగల్ ఎల్కతుర్తిలో జరుగుతున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్లారు. అంతకు ముందు పట్టణంలోని పలు వార్డుల్లో బీఆర్‌ఎస్ మాజీ కౌన్సిలర్లు పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు జగపతి, కృష్ణారెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి